Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఈఓ పాణి నీ
నవతెలంగాణ-ములుగు
జిల్లాలోని 101పాఠశాలకు చెందిన 3,734మంది విద్యార్థులపై ఈ నెల 12న జాతీయ సాధన సర్వే నిర్వహించనున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 35పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న 702మందికి, 28పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న 649 మందికి, 41పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 1058మందికి, 52పాఠశాలలో పదోతరగతి చదువుతున్న 1325మందిపై ఈ సర్వే నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ పరీక్ష నిర్వహణకు జిల్లావ్యాప్తంగా 101మంది పరిశీలకులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. 210మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లను నియమించి రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ సర్వేలో భాగంగా పరీక్ష అనంతరం విద్యార్థి యొక్క వ్యక్తిగత అంశాలకు సంబంధించి విద్యార్థి ప్రశ్నావళి, పాఠశాలలకు సంబంధించిన ప్రశ్నావళిని (స్కూల్ క్వశ్చనేర్ ) ప్రధానోపాధ్యాయులు పూర్తిచేసి పరిశీలకులకు అందచేయాలని సూచించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సర్వే విషయం ముందస్తుగా విద్యార్థులకు తెలియజేసి పూర్తిస్థాయిలో వారు హాజరు అయ్యేటట్లు చూడాలని తెలిపారు. సర్వే నిర్వహణకు వచ్చిన పరిశీలకులకు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు రికార్డులు అందుబాటులో ఉంచాలని, భౌతిక వసతులను కల్పించాలని పేర్కొన్నారు.