Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్ గోపీ
నవతెలంగాణ-నర్సంపేట
ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలని వరంగ్ కలెక్టర్ గోపి అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ చంద్రమౌళి అధ్యక్షతన నర్సంపేట, వర్ధన్నపేట, రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యాభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డిగ్రీ మొదటి సంవత్సర విద్యార్థులకు అన్ని అంశాలపై అవగాన కల్పించి ఉపాధి అవకాశాలను వివరించి వారి ఉన్నతీకి తోడ్పాడాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందన్నారు. నర్సంపేట కళాశాల ఆహ్లాదకరమైన వాతవరణంలో ప్రశాంతంగా చదువుకునేలా వసతులు కలిగి ఉందన్నారు. విద్యతో పాటు విద్యార్థులకు మనోవికాసం, భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు అర్హత సాధించేలా తీర్చిదిద్దాలన్నారు. కళాశాలలోని రోడ్డు సమస్యను పరిష్కరిస్తామన్నారు. వర్థన్నపేట, రంగశాయిపేట కళాశాల భవన నిర్మాణానికి తగిన స్థల సేకరణ చేస్తామని చెప్పారు. డిగ్రీ కళాశాలల్లో తగిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కళాశాలలో నిర్వహించిన 'స్టూడెంట్ స్పిరిట్ డే' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కష్టపడి చదివితే బంగారు భవిష్యత్‌ను వేసుకోవచ్చన్నారు. ఉన్నత విద్యలో ప్రతిభను కనపర్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉత్తమ పౌరులుగా ఎదుగాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ పీ.పవన్ కుమార్, లెక్కల విద్యాసాగర్ రెడ్డి, డాక్టర్ పీ.గోపాల్, రంగశాయిపేట కళాశాల ప్రిన్సిపల్ జీ.శ్రీనివాస్, వర్థన్నపేట ప్రిన్సిపాల్ ఎం.సమత, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ శ్రీనాథ్ అధ్యాపకులు పాల్గొన్నారు.