Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హన్మకొండ డీఎంహెచ్ఓ డా. లలితాదేవి
నవతెలంగాణ-మట్టెవాడ
మలేరియా, టీబీతో బాధపడుతున్న వారికీ చికిత్సనం దించడంతో పాటుగా, వాటి నిర్మూ ళనకు వైద్య సిబ్బంది కృషి చేయాలని హన్మకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి తెలిపారు. బుధవారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో మలేరియా, క్షయ ల్యాబ్ టెక్నిషియన్లు, నోడల్ ఆఫీసర్లు, పర్యవేక్షకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోగులకు సరిపడా పూర్తి స్థాయి లో మందులు అందుబాటులో ఉంచుకోవా లన్నారు. వ్యాధుల నిర్ధారణ కోసం అన్ని పరికరా లను అందుబాటులో ఉంచుకుని అన్ని పరీక్షలు చేయాలని ఆదేశించారు. 2025నాటికి జిల్లాను టీబీ రహితంగా తీర్చిదిద్దడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. పీహెచ్సీ కేంద్రాల్లో ఎన్సీడీ వ్యాధులకు చికిత్సను అందచేయాలని సూచించారు.తదననంతరం జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్.మల్లిఖార్జున్ మాట్లాడుతూ.. దగ్గు, జ్వరంతో బాధ పడుతున్న వారిని త్వరితగతిన గుర్తించి, వారికి అన్నీ రకముల పరీక్షలు నిర్వహించాలన్నారు. క్షయ నిర్ధారణ అయిన రోగి వివరాలు పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ట్రీట్మెంట్ సపోర్టర్ను(ఆశా) గుర్తించి వారికి తగు ప్రోత్చహం లభించే విధముగా చూడాలన్నారు . కోమార్బీడీటీ ( అనుబంధ వ్యాధులను) స్క్రీనింగ్ లో భాగంగా ( హెచ్ఐవీ , డయబెటిస్, హైపర్టెన్షన్, కోవిడ్) లక్షణములు కల వారికి కూడా పూర్తి స్థాయి పరీక్షలు చేసి చికిత్సను అందజేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ టీ మదన్ మోహన్ రావు, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాశ్రీ, ఇన్చార్జ్ డెమో ఎల్ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.