Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిల్లర్ల కోతలను అరికట్టాలి
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొరబోయిన కుమారస్వామి
నవతెలంగాణ-నర్సంపేట
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొరబోయిన కుమారస్వామి డిమాండ్ చేశారు. బుధవారం లక్నెపెల్లి, మహేశ్వరంలోని నర్సంపేట-వరంగల్ రోడ్డు ప్రధాన రహదారిపై రాసా ్తరోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విమర్శలతో దోబూచులాడుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లరు, ఐకేపీ, పీఏసీఎస్, రైతుమిత్ర సంఘాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను చేపట్టాలన్నారు. కేంద్రం బియ్యం సేకరణపై ఎఫ్సీఐచే ఆంక్షలు విధించడం సరికాదన్నారు. వెంటనే రైతు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్నారు. కిందటి సీజన్లో రైస్ మిల్లర్లు, అధికారులు కుమ్ముక్కై క్వింటాల్‌పై 8కిలోలు కోత పెట్టి రైతులను నిలువు దోపిడిచేశారన్నారు. సివిల్ సప్లరు అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా రైస్ మిల్లర్లకు కొమ్ముకాశారని ఆరోపించారు. ధాన్యంపై ఎలాంటి కోతలు లేకుండా, వెను వెంటనే గన్నీసు సంచులను పంపిణీ చేసి కొనుగోలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్నారు. వరి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేయాలన్నారు. లేకపోతే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కత్తి కట్టయ్య, ఎండీ కతీబ్, రాజులపాటి సూరయ్య, కమతం వెంకటేశ్వర్లు, బీ.మలహాలరావు, కే.శ్రీనివాసరెడ్డి, రుద్రారపు లక్ష్మి, పత్కాల బాబు, రుద్రారపు లక్ష్మి పాల్గొన్నారు.