Authorization
Mon Jan 19, 2015 06:51 pm
11మందిపై కేసు నమోదు
నవతెలంగాణ-మట్టెవాడ
బుధవారం వరంగల్ ఏసీపీ పరిధిలోని ఇంతేజార్గంజ్, మిల్స్‌కాలనీ, మట్టెవాడ పోలీసు స్టేషన్ల పరిధిలోని పాన్‌షాపులు, కిరాణా షాపుల్లో డీసీపీ పుష్ప, ఏసీపీ గిరికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా 149 షాపులను తనిఖీ చేయడగా, నిషే దిత ఉత్పత్తులు విక్రయిస్తున్న 11మందిపై పోలీ సులు కేసు నమోదు చేశారు. నిషేదిత ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని డీసీపీ, ఏసీపీలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటు గణేశ్, మల్లేశం, శ్రీనివాస్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
వేలెరు : బుధవారం మండలంలోని కిరాణం, పాన్ షాపులు, జనరల్ స్టోర్స్‌లలో ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాటా ్లడుతూ. ఎవరైనా మత్తుపదార్థాలు విక్రయిం చినట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఏఎస్సై ఉమాకాంత్, పోలీసు సిబ్బంది ఉప్పలయ్య, హైమద్, నాగార్జున, సంపత్, డ్రైవర్ అజరు తదితరులు పాల్గొన్నారు.
ఐనవోలు : మండలంలోని కిరాణా, పాన్ షాపులను బుధవారం సీపీ ఆదేశాల మేరకు ఎస్సై భరత్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. నిషేదిత ఉత్పత్తులను విక్రయించినట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
నడికూడ : చౌటుపర్తిలో తనిఖీలు నిర్వహించగా నిషేదిత అంబర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్టు పరకాల సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. చౌటపర్తిలో బిట్ల సత్యం కిరాణం షాప్‌లో తనిఖీలు నిర్వహించగా 45 అంబర్ ప్యాకెట్లు దొరికినట్టు, వాటి విలువ రూ.లు 33,750 ఉంటుందని తెలిపారు. నిందితుడిని పీఎస్‌కు తరలించి కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎస్సై ప్రశాంత్ బాబు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.