Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
వికలాంగులు, వయోవద్ధులు కోసం ఏర్పాటు చేసిన వాహనాలు నిరుపయోగంగా ఉన్నాయని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో శిథిలావస్థకు చేరిన వాహనాలను ఆయన బుధవారం పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షలాది రూపాయలు ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేసిన ఈ వాహనాలు పంపిణీ చేయకపోవడంతో డబ్బు వృథా కావడంతో పాటు, వాటిపై ఆధారపడ్డ ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. వెంటనే వాహనాలను ఉపయోగంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.