Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
బేటీ పడావో బేటీ బచావో నినాదంతోనే సామాజిక సంతులిత అభివృద్ధి సాధ్యమని తాడ్వాయి ప్రాజెక్ట్ సీడీపీఓ మల్లేశ్వరి తెలిపారు. మండలంలోని మచ్చాపూర్ పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాలు అవగాహన సదస్సు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించగా సీడీపీఓ మల్లేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలల సమస్యలు, చట్టాలపై విద్యార్థులకు అవగాహనా కల్పించారు. బాలలు హక్కుల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ ప్రణరు కుమార్ మాట్లాడారు. బాలలు జీవించే, అభివృద్ధి చెందే, భాగస్వామ్యం, రక్షణ హక్కుల గురించి చైతన్యవంతం కావాలని సూచించారు. హక్కుల ఉల్లంఘన జరిగితే బాలల సంక్షేమ సమితి, బాలల న్యాయ మండలి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్ లైన్ సంస్థల సేవలను పొందాలని కోరారు. అనంతరం సమ్మయ్య అధ్యక్షత వహించి మాట్లాడారు. బాల్య వివాహాలు, బాలలతో పనులు చేయించడం, బాలల అక్రమ రవాణా, తదితరాలపై చైల్డ్ హెల్ప్ లైన్-1098కు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం లీగల్ ఆఫీసర్ సురేష్ మాట్లాడారు. బాల్యం అత్యంత అరుదైనదని, మీ హక్కులు భంగం కలిగనప్పుడు వెంటనే బాలల పరిరక్షణ సంస్థలను సంప్రదించాలని, మీ పరిసరాల్లో ఎవరైనా బాలలు ప్రమాదంలో ఉంటే వెంటనే 1098 నెంబర్కు కాల్ చేయాలని కోరారు. అనంతరం సీడీపీఓ మల్లేశ్వరి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీసీపీఓ సోషల్ వర్కర్, లీగల్ ఆఫీసర్ సురేష్, అంగన్వాడీ టీచర్లు భాగ్య, పద్మారాణి, పద్మావతి, ఊర్మిళ, రమాదేవి, సరిత, జెడ్పీ హైస్కూల్ బాబురావు, సమ్మయ్య, చైల్డ్ లైన్ చంటి, తదితరులు పాల్గొన్నారు.