Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్కు ఎంపీటీసీ వినతి
నవతెలంగాణ-గూడూరు
మండల కేంద్రంలోని ఏకలవ్య పాఠశాలకు కేటాయించిన భూమి విషయంలో బాధిత రైతు లకు న్యాయం చేయాలని కోరుతూ గూడూరు ఎంపీటీసీ-2 కత్తి స్వామి జిల్లా కలెక్టర్ శశాంక ను మండల పర్యటనకు వచ్చిన సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో గురువారం కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడారు. గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చంద్రుగూడెంలో సర్వే నెంబర్ 298/1లో ఏకలవ్య స్కూల్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో 80 ఏండ్లుగా 50 గిరిజన కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని చెప్పారు. స్కూల్ నిర్మాణం పేరుతో గిరిజనులను రోడ్డుపైకి నెట్టడం సరికాదన్నారు. ఏకలవ్య పాఠశాలను మరోచోట నిర్మించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పట్టణ అధ్యక్షుడు రసూల్, ఉపసర్పంచ్ శివరాత్రి సంపత్, వార్డు సభ్యులు గోపగాని యాదగిరి, కాంగ్రెస్ నాయకులు పూజారి శంకర్ గౌడ్, సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలమంద శ్రీనివాస్, దోమ సతీష్, తదితరులు పాల్గొన్నారు.