Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ గిర్ని తండాలో ఫార్మేషన్ రోడ్డు పనులను జెడ్పీటీసీ రావుల శ్రీనాధ్‌రెడ్డి, సర్పంచ్ బట్టు శ్రీనులతో కలిసి ఎంపీపీ వోలం చంద్రమోహన్ గురువారం ప్రారంభించి మాట్లాడారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ విడుదల చేసిన రూ.9 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిఆపరు. కార్యక్రమంలో ఎంపీడీఓ రోజ రాణి, కేసముద్రం విలేజి సర్పంచ్ ప్రభాకర్, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు నెహ్రూ నాయక్ , రమేష్ నాయక్, హనుమ నాయక్, తదితరులు పాల్గొన్నారు.