Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
జాతీయ సాధన సర్వే-2021 కేటాయించిన పాఠశాలలకు అబ్జర్వర్లు సమర్ధవంతంగా పని చేయాలని డీఈఓ పాణిని కోరారు. జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయంలో గురువారం 101 మంది పరిశీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ పాణిని మాట్లాడారు. ఈనెల 12న పరిశీలకులకు ఉదయం 8 గంటల కల్లా సర్వే సామాగ్రితో సంబంధిత పాఠశాలకు చేరుకోవాలని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి విద్యార్థుల హాజరు, ఇతర వివరాలు సర్వేకు విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలన్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ సాయంతో సర్వే నిర్వహించాలని సూచించారు. అబ్జర్వర్లు కంట్రోల్ షీట్ ఆధారంగా విద్యార్థులకు సర్వే ప్రశ్నపత్రం, ప్రశ్నావళి ఇచ్చి పూర్తి చేయించాలని తెలిపారు. అనంతరం ఓఎంఆర్ షీట్లను ఎంఈఓల ద్వారా సాయంత్రం 4 గంటలకు జిల్లా కార్యాలయంలో అందజేయాలని, ఇతర వివరాలకు ఎన్ఏఎస్-2021 జిల్లా కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డిని సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో జాతీయ పరిశీలకులు లీనా సింగ్, సమీక్ష, కోఆర్డినేటర్లు రమాదేవి, సాంబయ్య, రాజు అర్షం, డీఎస్ఓ జయదేవ్, తదితరులు పాల్గొన్నారు.