Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించాలని సిబ్బందికి డీఎస్ఓ నర్సింగరావు చెప్పారు. ఖరీఫ్ 2021-22 ధాన్యం కొను గోళ్లపై డీఆర్డీఏ సన్యాసయ్య, సివిల్ సప్లైస్ డీఎం మహేందర్ ఆధ్వర్యంలో జెడ్పీ సమావేశ, జిల్లా సమాఖ్య భవనంలో వేర్వేరుగా గురువారం నిర్వహిం చిన శిక్షణా కార్యక్రమాలకు ఆయన హాజరై మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల సిబ్బందికి 15 మండలాలకు సంబంధించి 67 కేంద్రాల్లో విధులు నిర్వహించే లా శిక్షణ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.