Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవి కోరారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన క్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ముందస్తు అనుమతి లేకుండా బ్యానర్లు కట్టొద్దని, ర్యాలీలు నిర్వహించొద్దని స్పష్టం చేశారు. జిల్లాలోని ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, ఏటూర్‌నాగారం మండలాలకు చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పోలింగ్ కేంద్రాల విషయమై చర్చించినట్టు తెలిపారు. జిల్లా కేంద్రంలో గత శాసనసభ ఎన్నికలసమయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం నెంబర్ 135ను జెడ్పీ బాలికల స్కూల్లోని ఆరో తరగతి గదిలో నిర్వహించడానికి గుర్తించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రం ఏర్పాటు విషయమై రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయం తీసుకున్నారు. సమావేశంలో తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ రాజు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంబాల రవి, వైఎస్సార్టీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ అన్నం తిరుపతి, బీజేపీ మండల ప్రెసిడెంట్ కొత్త సురేందర్, నాయకులు ఇమ్మడి ప్రకాష్ యాదవ్, ఎల్లం ఆశ, ఉపసర్పంచ్ నల్లమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.