Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
ముదిరాజ్ల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేయాలని కోరుతూ గురువారం ముదిరాజ్ సంఘం నాయకులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాలకుర్తి ముదిరాజ్ పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు దాసరి మధు మాట్లాడుతూ... పాలకుర్తి లో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ కోసం నిధులు మంజూరు చేయాలన్నారు. పెద్దమ్మ ఆలయానికి ప్రహారీగోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తరాలతరాల చంద్రబాబు, సొసైటీ నాయకులు మామిండ్ల రమేష్ రాజా, జీడి మల్లయ్య, మామిండ్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.