Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు జీర్ణించుకోలేక కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కుట్ర చేస్తోందని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా ఉందని తెలిపారు. అమలు తీరును జీర్ణించుకోలేని కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు పై ఆంక్షలు విధించిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లపై విధించిన షరతులను వ్యతిరేకిస్తూ నేడు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి సొసైటీ చైర్మన్ బొబ్బల అశోక్ రెడ్డి, నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, భూమ రంగయ్య, దొంతమల్ల గణేష్, సుధాకర్ రెడ్డి, చిక్కుడు రాములు, మాచర్ల ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.