Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తాసీల్ధార్ కార్యాలయం ఎదుట బాధిత రైతు బైఠాయింపు
నవతెలంగాణ-మల్హర్రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని సర్వే నెంబర్ 873 రక్బ 11 గుంటల భూమి ని అక్రమంగా ఆన్లైన్ పట్టా చేసుకున్నారని బాధిత రైతు కోట లక్ష్మయ్య ఆరోపించారు. గురువారం మండల తాసీల్ధార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి బైఠాయించాడు. ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ... 40 సంవ త్సరాలుగా తమ భూమిలో ఇల్లు నిర్మాణం చేసుకొని జీవిస్తున్నానని, పహాని, మోకాపై ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం డిజిటల్ పట్టాదారు పాసుబుక్కులు ఇస్తున్న క్రమంలో తాము రెవెన్యూ అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నా ఆన్లైన్ పట్టా చేయలేదన్నారు. దీనికితోడు అక్రమంగా ఆన్లైన్ చేసుకున్న బొబ్బిలి లావణ్య వద్ద రెవెన్యూ అధికారులు ముడుపులు తీసుకుని పట్టా చేశారని వాపోయారు. తాము రెవెన్యూ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించు కోలేదని కన్నీరుమున్నీరయ్యారు. తాసిల్ధార్ ట్టించుకుని అక్రమంగా పట్టా చేసుకున్న లావణ్య పై ఉన్న పట్టాను తొలగించి తనకు పట్టా చేయాలని విజ్ఞప్తి చేశారు. తహశీల్దార్ న్యాయం చేస్తామనడంతో నిరసన విరమించారు.