Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
వరిధాన్యం కోతలు ప్రారంభమైన ప్రాంతాల్లో వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. జిల్లాలో వానకాలం సీజన్లో లక్షా60వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల కు వచ్చే అవకాశం ఉందని, జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్, డీఆర్డీఏ, జీసీసీల ద్వారా 160 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని వ్యవసాయ, పౌరసరఫరాలశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లాలో వరి ధాన్యాన్ని ఎలాంటి ఆరోపణలు రాకుండా సమయానికి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ముందస్తుగా ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ లను లీగల్ మెట్రాలజీ వారితో పరీక్షించుకోవాలన్నారు. 17 శాతం తేమపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడినంతగా టార్ఫాలిన్లు, గన్ని బ్యాగులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు రవాణా ఏర్పాట్లను పక్కాగా చేయాలన్నార. ఈ కార్యక్రమంలో జేసీ కూరాకుల స్వర్ణలత, జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీశంకర్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాఘవేందర్, జిల్లా సహకార అధికారి మద్దిలేటి, మార్కెటింగ్ అధికారి శేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి విజరుభాస్కర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి పురుషోత్తం పాల్గొన్నారు.