Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-పాలకుర్తి
దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఓకే లాగే వ్యవహరిస్తున్నాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఆరోపించారు. గురువారం చాకలి ఐలమ్మ స్మారక భవనంలో పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు చిట్యాల సోమన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు రైతుల్ని అయోమయానికి గురి చేస్తున్నాయని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా బీజేపీ పని చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల పంటల కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు ప్రత్యేక బోనస్ కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమగ్ర పంటల సేకరణ విధానం ప్రకటించి అన్ని పంటలను పంటల బీమా పథకాల పరిధిలోకి తేవాలన్నారు. యాసంగి వరి ధాన్యం తగ్గించాలని రైతులను బెదిరించే ధోరణి మానుకోవాలన్నారు. రైతులకు అవగాహన కల్పించి యాసంగి లో రైతులు ప్రత్యేక పరిస్థితుల వల్ల వరి ధాన్యం సాగుచేసిన ప్రభుత్వం కొనుగోలు ఏర్పాట్లు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, ధరలు అదుపులోకి తేవాలన్నారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, ఏరియా కమిటీ కార్యదర్శి సింగారపు రమేష్, మాసంపల్లి నాగయ్య, ముస్కు ఇంద్రారెడ్డి. బెల్లి సంపత్, పనికర రాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.