Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగొద్దని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని విశ్వనాథపూర్ గ్రామంలో ఓరుగల్లు జిల్లా కోఆప రేటివ్ మార్కెటింగ్ సొసైటీ(ఓడీసీఎం) ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ చరిత్రలో వరి ధాన్యం పండించే ఏకైక రాష్ట్రం తెలం గాణ అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం కేవలం పంజాబ్ రాష్ట్రంలో మాత్రం ధాన్యం కొనుగోలు చేస్తా మనడం బాధాకరమన్నారు. కోటి35లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంలో 68లక్షల హెక్టార్లలో వరి పంట పండించిన ఘనత తమ రాష్ట్రానిదే అన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి, రైతుల పక్షపాతిగా నిలిచారన్నారు. ప్రస్తుతం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1960, సాధారణ రకానికి రూ. 1940 కొనుగోలు చేస్తామన్నారు. స్టేషన్ ఘనుపూర్ మండలంలో ఇప్పటికే ఐకేపీ, ప్యాక్స్ ఆధ్వర్యంలో 13 కొనుగోలు కేంద్రాలు మంజూరు అయ్యాయని, ఓడీసీఎం ఆధ్వర్యంలో నిర్వహించే మరో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం మంజూరు చేశామ న్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ స్టాన్డింగ్ కమిటీ ఛైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ, మార్కెట్ ఛైర్మన్ గుజ్జరి రాజు, సర్పంచులు అను మాల మల్లేశం, రాజు, పీఏసీఎస్ డైరెక్టర్లు తోట సత్యం, ఎఎంసి డైరెక్టర్ చిగురు సరితాంజనేయులు, పీపుల్స్ రూరల్ డెవలప్మెంట్ వ్యవస్థాపకుడు గుర్రం యేసుబాబు, గ్రామశాఖ అధ్యక్షులు గుర్రపు నరసింహ, మండల మహిళా అధ్యక్షురాలు పెదపూండ్ర స్వాతి, యూత్ నాయకులు మారేపల్లి ప్రసాద్, గుండె మల్లేష్, అశోక్ పాల్గొన్నారు.