Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వడ్లు కొంటరా... కొనరా.. ? సూటిగా చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం హన్మకొండలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పెట్టుకోవాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. వ్యవసాయ బిల్లులను రాష్ట్రంలో అమలు చేయడం లేదనే కేంద్రం తమపై కక్షతో వ్యవహరిస్త్తోందన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామిలను నేటికీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదన్నారు. బీజేపీ నేతలను రాష్ట్రంలో కొట్టే రోజులొస్తయని మంత్రి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్నారు. వడ్లు కొనుగోలుపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజరు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారన్నారు. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయనందుకు నిరసనగా నేడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టీిఆర్‌ఎస్ నేతృత్వంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమాల్లో రైతులు, పార్టీ నేతలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఛీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్, మేయర్ గుండు సుధారాణి, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, వి. ప్రకాశ్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.