Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని రాణించాలని ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య కోరారు. డివిజన్ కేంద్రం లోని సాయినగర్‌లో బేడ బుడగ జంగాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి క్రికెట్ పోటీలను నిర్వాహకులతో కలిసి గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానం గా స్వీకరించి స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. క్రీడలు దేహదారుఢ్యాన్ని పెంచడంతోపాటు మానసిక వికా సానికి బాటలు వేస్తాయని చెప్పారు. క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలో క్రీడా మైదానాలను నిర్మించేందుకు కషి చేస్తోందని, క్రీడాకారులను, కోచ్‌లను క్రీడా శాఖ ప్రోత్స హిస్తోందని తెలిపారు. తెలంగాణను క్రీడాహబ్‌గా రూపొం దించేందుకు సీఎం కేబినెట్ సబ్‌కమిటీని నియమించారని తెలిపారు. క్రీడల్లో సమగ్రాభివద్ధి సాధించే దిశగా అత్యున్నత మైన నూతన క్రీడా విధానాన్ని ప్రకటించేందుకు ప్రభుత్వం పాటు పడుతోందని చెప్పారు. విజేతలకు కౌన్సిలర్లు చకిలేల అలివేణి నాగరాజు మొదటి, తూర్పాటి సంగీత రవి రెండో, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు అబ్బనబోయిన కేశవ్ యాదవ్ మ్యాన్ ఆఫ్ సిరీస్ బహుమతులు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ జిల్లా నాయకులు తూర్పాటి నీలేష్, తూర్పాటి సతీష్, భజరంగ్ యూత్ అధ్యక్షుడు తూర్పాటి శివ, ప్రతినిధులు విజరు, సంపత్, సాయి, సునీల్, కిట్టు, అజరు, శంకర్, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.