Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
మహిళా శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీడీపీఓ హైమావతి తెలిపారు. డివిజన్ కేంద్రం లో ఆ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు గురువారం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రాజెక్ట్ సమావేశంలో సీడీపీఓ మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం, బాలామృతం, గ్రోత్ మానిట రింగ్ స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. లబ్ధిదారులకు ప్రతిరోజూ బయోమెట్రిక్ హాజరు, పౌష్టికా హార వివరాల నమోదుకు అన్ని అంగన్వాడీ సెంటర్లకూ స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. అంగన్ వాడీ సెంటర్ల నిర్వహణలో పారదర్శకత సాధించేలా చూడ డంతోపాటు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే సేవల్లో నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు రికార్డుల్లో వివరాలు నమోదు చేయాలని చెప్పారు. పోషకాహార లోప సవరణ, ఆరోగ్య జాగ్రత్తలపై మండల ఆయుర్వేద వైద్యురాలు నిరంజని జకోటియా, పీహెచ్సీ వైద్యురాలు మీరాజ్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏసీడీపీఓ ఇందిర, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.