Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-హన్మకొండ
కేంద్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలను తిప్పికొడతామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా పరిధిలోని హన్మకొండ, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోనల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేసేలా ఒత్తిడి తీసుకొచ్చేం దుకు ఉద్యమాలు చేపడతామని తెలిపారు. రాష్ట్ర రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. వరంగల్ పశ్చిమ, తూర్పు, వర్ధన్నపేట, నర్సం పేట, పరకాల, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, జనగామ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు దాస్యం వినరుభాస్కర్, నరేందర్, అరూరి రమేష్, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్‌నాయక్, రెడ్యానాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య పాల్గొని మాట్లాడారు. పాలకుర్తిలో మంత్రి దయాకర్‌రావు ఎడ్లబండిపై ధర్నా వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. జనగామలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.