Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
చదువుతోపాటు ఇష్టమైన రంగాల్లో శ్రద్ధ చూపితే భవిష్యత్లోో ఉన్నతంగా ఎదుగుతారని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా చిన్నారులకు సూచించారు. శుక్రవారం ప్రగతి భవన్ లో స్త్రీ, శిశు సంక్షేమశాఖ, బాలల హక్కుల సంరక్షణ సమితి ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడు కలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, జిల్లా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి కలెక్టర్ మాట్లాడారు. బాలల హక్కుల సంరక్షణకు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. పోష కాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులను జిల్లాలో గుర్తించామని, వారందరికీ అంగన్వాడీల ద్వారా ప్రత్యేక పౌష్టికాహారం అందించాలన్నారు. అనంతరం సెమీ ఆర్ఫన్, ఆర్ఫన్ బాలబాలికలు 63 మందికి నెలకు రెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం డీడీలను, నిత్యావసర సరుకులను అందించారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలో నిర్వహించిన క్రీడలు, సాంస్కతిక పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు అందించారు. జిల్లా సంక్షేమ అధికారి కే.సామ్యూల్, సీడబ్ల్యూసీ చైర్మన్ వేణుగోపాల్, బాల రక్షా భవన్ అధికారి శిరీష, డీసీపీఓ హరికష్ణ జిల్లా బిసి అభివద్ధి అధికారి శైలజ, జిల్లా ఎస్పీ అభివద్ధి అధికారి సునీత, జిల్లా యువజన సర్వీసులశాఖ అధికారి సునీత, డీపీఆర్ఓ రవికుమార్ పాల్గొన్నారు.
భూసేకరణపై దృష్టిసారించాలి
మంచిర్యాల-హనుమకొండ గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకరణపై దృష్టి సారించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా రెవెన్యూ, సర్వే ల్యాండ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, సర్వే ల్యాండ్, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంతో ప్రయాణ సమయం, ఇందనం ఆదా అవుతుందని అన్నారు. రవాణా సౌకర్యం పెరిగి స్థానిక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. జిల్లాలోని టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో 25 కిలోమీటర్ల మార్గం ఉందని, మూడు మండలాల్లో 14 గ్రామాల పరిధిలో భూమిని గుర్తించాల్సి ఉందన్నారు. ఇప్పటికీ ల్యాండ్ సర్వే శాఖ ద్వారా 12 గ్రామాల్లో సర్వే పూర్తయిందన్నారు. మిగతా సర్వే పూర్తిచేసి ఎస్ డిఆర్ సమర్పించాలన్నారు. రెవెన్యూశాఖ వారు సర్వే ద్వారా గుర్తించిన రహదారికి అవసరమైన భూమి ఎవరి ఆధీనంలో ఉందో ఎంజారు మెంట్ సర్వే చేసి రిపోర్ట్ సమర్పించాలన్నారు. సర్వే నిర్వహించిన ప్రాంతాల్లో ప్రతి 100 మీటర్ల దూరానికి ఒక పెగ్ మార్క్ పెట్టాలని ఆదేశించారు. రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు ఆయా ప్రాంతాల్లో భూములపై జాయింట్ సర్వే నిర్వహించాలని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, జిల్లా అటవీశాఖ అధికారి లావణ్య, కలెక్టరేట్ సూపరింటెం డెంట్ రవికిరణ్, ఎఫ్డీఓ కృష్ణప్రసాద్, తాసిల్దార్ లు షరీఫ్, రామారావు, మల్లయ్య, నేషనల్ హైవే ల్యాండ్ అక్విజిషన్ అధికారి రాజారాం పాల్గొన్నారు.
పనుల్లో వేగం పెంచాలి
పంచాయతీరాజ్‌శాఖ ద్వారా చేపట్టిన అబివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో జిలా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షించారు. 2018-19, 2020 -21, 2021 -22లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా స్కూల్ బిల్డింగ్స్, రోడ్స్, తాసిల్దార్ ఆఫీస్‌లు, చెక్‌డ్యాంలు, కమ్యూనిటీ హాల్స్, తదితర నిర్మాణాలు చేపట్టారని అన్నారు. సంబంధిత పనుల నివేదిక పూర్తిస్థాయిలో సమర్పిం చాలన్నారు. నిధుల సమస్య ఉండి ఆగిపోయిన పనులను రూరల్ డెవలపమెంట్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీతో మాట్లాడి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాణహిత పుష్కరాలు దగ్గర పడుతున్నందున పనులు పూర్తి చేయాలన్నారు. పంచాయతీరాజ్‌శాఖ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈలు ఆత్మారాం, సాయిలు, ఏఈలు పాల్గొన్నారు.