Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి
నవతెలంగాణ-వెంకటాపూర్
కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా లింగాల రమణారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తుందని, మద్దతు ధర అందిస్తుందని తెలిపారు. అనంతరం జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీశ్వర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో తలపెట్టిన ధర్నాకు రమణారెడ్డి నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు బయల్దేరి వెళ్లారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.