Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
వరి పంట సాగుపై ఆంక్షలను ఎత్తివేసి ఖరీఫ్, రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లా డారు. వరి సాగు చేయొద్దనే నిర్ణయాన్ని ఉసంహరించు కోవాలని, రైతులు పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని, ఆహార ఉత్పత్తుల దిగుమతులను నిషేధించాలని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దేశెట్టి రామచంద్రయ్య, జిల్లా అధ్యక్షుడు సనప పొమ్మయ్య, జిల్లా నాయకులు గుజ్జు దేవేందర్, తాజ్ పాషా, మండల అధ్యక్ష, కార్యదర్శులు రామగిరి భిక్షమ్, బానోత్ నర్సింహ, మండల నాయకులు పూనెం లింగన్న, మేకపోతుల నాగేశ్వర్రావు, బొమ్మల చిట్టిబాబు, నూతక్కి భూషణ్‌రావు, గుండెబోయిన లింగమల్లు, కల్తీ విష్ణురావు, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.