Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని 13 ప్రభుత్వ పాఠశాలల్లో 24 తరగతుల విద్యార్థులతో నేషనల్ అచీవ్మెంట్ సర్వే (నాస్) శుక్రవారం నిర్వహించినట్లు ఎంఈఓ లకావత్ రాజేష్ కుమార్ తెలిపారు. సర్వేలో 13 మంది అబ్జర్వర్లు, 26 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు పాల్గొన్నట్లు చెప్పారు. సర్వేలో పాఠశాలలోని విద్యార్థుల స్థితిగతులు, పాఠశాల పట్ల విద్యార్థుల స్పందన, చదువు పట్ల విద్యార్థులకున్న ఆసక్తి, విద్యార్థలు ప్రాథమిక, ఉన్నత చదువులు చదివించేందుకు గల కుటుంబ స్థితిగతుల పట్ల సర్వే నిర్వహించినట్లు తెలిపారు. మండలంలోని 13 ప్రభుత్వ పాఠశాలల్లోని 3, 5, 8, 10 తరగతుల విద్యార్థుల నేపథ్యం, వారి ప్రతిస్పందన గురించి సర్వే చేసినట్టు చెప్పారు.