Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ధాన్యం కొనుగోలు చేసి యాసంగి పంటలు వేసుకునేందుకు అనుమతివ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో వినతి పత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా రైతులు వరికోసి ఆరబెట్టారని, కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్నారు. యాసంగి సీజన్ లో వరి వేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పడం సరైంది కాదన్నారు. జిల్లాలో వరి మాత్రమే ప్రధాన పంట అని, వేరే పంటలతో దిగుబడి రాక రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు గుర్రం దేవేందర్, సంజీవ్, రాజేందర్, రాజు, సమ్మయ్య, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.