Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో గొర్రెల పంపిణీ కార్యక్రమం పూర్తిస్థాయిలో జరగాలని, భాద్యతగా విధులు నిర్వహించాలని పశుసంవర్ధకశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి అ శాఖ ద్వారా జిల్లాలో అమలుచేస్తున్న కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రైతులకు పశు సంపదతో అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. క్రమంతప్పకుండా వ్యాక్సినేషన్ వేయడంతోపాటు పశుసంపద నిర్వహణపై సూచనలివ్వాలన్నారు. లబ్ధిదారు లందరికీ సబ్సిడీ గొర్రెల యూనిట్లు అందేలా చూడాలన్నారు. గొర్రెల యూనిట్లు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, నంద్యాల నుండి తీసుకొచ్చేందుకు వెళ్లే లబ్ధిదా రులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్రస్థాయి గొర్రెల పంపిణీ టీంతో అనుసంధానం చేస్తూ జిల్లాకు గొర్రెలను తీసుకొచ్చేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితులపై నివేదిక అందించాలన్నారు. పెరటి కోళ్ల పెంపకం పథకానికి జిల్లాలో 90 యూనిట్లు మంజూరయ్యా యని అన్నారు. సుమారు రూ.కోటి అందుబాటులో ఉన్నా ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపిక కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కుమారస్వామి మాట్లాడుతూ జిల్లాలో 155 గొర్రెల పెంపకం దారుల సొసైటీ లు ఉన్నాయన్నారు. జిల్లాకు 12785 సబ్సిడీ గొర్రెల యూనిట్లు మంజూర య్యాయన్నారు. వాటిలో మొదటి విడతగా 6351 యూనిట్లను అందించినట్టు తెలిపారు. ప్రస్తుతం రెండో విడతలో డీడీలు తీసిన లబ్ధిదారులు నెల్లూరు, నంద్యాలకు వెళ్లి గొర్రెలను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ద్వారా 500 పెరటి కోళ్ల యూనిట్లు మంజూరు కాగా 488 యూనిట్లను అందించామన్నారు. పశుసంవర్ధకశాఖ ఏడీ శ్రీదేవి పాల్గొన్నారు.