Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, లేదంటే ఆందోళన చేపడతామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయ ఏఓ మురళీధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోకు కనకారెడ్డి మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ దగా చేస్తునానయన్నారు. రైతుల సమస్యలు పట్టించుకోని బీజేపీ, టీఆర్ఎస్ ఒకరిపై ఒకరు రాజకీయ డ్రామాలాడుతూ దీక్షలు, ధర్నాలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. వరి ధాన్యం చేతికి వచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి గన్ని బ్యాగ్‌లు, ట్రాన్స్పోర్ట్ కొరత లేకుండా చూడాలన్నారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోట్ల శ్రీనివాస్, రాపర్తి రాజు, జిల్లా కమిటీ సభ్యులు పులి ఉపేందర్, నాయకులు జోగు ప్రకాష్, టి దేవదానం, జి లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.