Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
కేంద్రం బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరునగర్లో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‌తో పాటు ఎమ్మెల్యే గండ్ర పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల వివక్షత చూపుతుందన్నారు. పంజాబ్‌లో వడ్లు కొనుగోలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని, రైతు పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. గండ్ర వెంకటరమణారెడ్డి తోపాటు ఎంపీ దయాకర్, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మాజీ జెడ్పీ చైర్మెన్ సాంబారి సమ్మరావు, మున్సిపల్ చైర్పర్సన్ ఎస్ వెంకటరాణి సిద్ధు, వైస్‌చైర్మెన్ కొత్త హరిబాబు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్, ఎంపీపీ మండల లావణ్య విద్యాసాగర్‌రెడ్డి, అర్బన్ అధ్యక్షులు కటకం జనార్ధన్, టీఆర్ఎస్ నాయకులు రమేష్‌గౌడ్, సాంబమూర్తి, తదితరులు పాల్గొన్నారు.