Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నల్ల చట్టాల్ని వ్యతిరేకించేందుకు
ప్రజలను చైతన్యం చేయాలి
అ ఎఫ్‌సీఐ కొనేవరకు ఉద్యమిద్దాం
అ ధాన్యం కొనుగోలు కోసం ఢిల్లీని ముట్టడిస్తాం
అ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-పాలకుర్తి
రైతులు పండించే ధాన్యం కొనుగోలు కోసం కేంద్రం మెడలు వంచేందుకు రైతులు సమాయత్తం కావాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పాలకుర్తిలో టీఆర్ఎస్ చేపట్టిన ధర్నా సభాస్థలికి ఆయన ఎడ్లబండిపై చేరుకుని నిరసన తెలిపారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో మంత్రి పాల్గొని మాట్లాడారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వ్యతిరేకించేందుకు రైతులను చైతన్యం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ధాన్యం పండించొద్దని తెలంగాణపై కేంద్రం షరతులు విధించిందని తెలిపారు. కేంద్రం ఆధీనంలో ఉన్న ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు చేయబోమని చేతులెత్తేసిందని, ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు చేసేందుకు ఢిల్లీని ముట్టడించాలని సూచిం చారు. రాష్ట్రప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలతోపాటు ప్రాజెక్టులతో వరి సాగు పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, బీజేపీ రైతు వ్యతిరేకి ప్రభుత్వమని తెలిపారు. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ, మతాలను ప్రోత్సహిసూ మతవిద్వేషాలు రెచ్చగొడుతోందని అన్నారు. నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ గతేడాదిగా ఢిల్లీలో రైతులు నిరసన తెలుపుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి చలనం లేదన్నారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా రాష్ట్రంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారంలో ఉన్నప్పటికీ రైతు ప్రయోజనాల కోసం ధర్నాలు చేయక తప్పడం లేదన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, జెడ్పీటీసీ పూస్కూరి శ్రీనివాసరావు, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండీ మదర్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ వీరమనేని యాకాంతారావు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ జరుపుల బాలునాయక్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి, తొర్రూర్ సొసైటీల చైర్మన్లు బొబ్బల అశోక్ రెడ్డి, గోనె మైసిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీవన్నీ జూటా మాటలు
మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
మతోన్మాద బీజేపీ మాటలన్నీ జూటా మాటలని, కార్పొరేట్ శక్తులకు ప్రజల ఆస్తుల్ని అప్పనంగా ముట్టజె పుతు న్నదని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధివిధానాలకు నిరసనగా, నల్ల చట్టాలను రద్దు చేయాలని, యాసంగి ధాన్యం కొను గోలు చేయాలని డిమాండ్ చేస్తూ, నియోజక వర్గ కేంద్రం లోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నేతృత్వంలో శుక్రవారం ధర్నా నిర్వ హించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు కేంద్రంలో ఓ మాట, రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొడుతోందని సంజరు, కిషన్ రెడ్డి వంటి బీజేపీ నాయకుల వక్రపు మాటలు మానుకుని, దమ్ముంటే కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేలా చేయాలన్నారు. నిరసన తెలుపుత్ను రైతులపైకి బీజేపీ కేంద్ర మంత్రి కారుతో తొక్కించి ఎంతో మంది రైతుల మరణానికి కారణమయ్యా రని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అంబానీ, అదానీ వంటి పెట్టుబడి దారులకు అప్పగిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులమేలుకు రూ. 30కోట్లుముందస్తు గ్యారం టీతో కొనుగోలు ప్రారంభించిందన్నారు. పెట్రోల్, డీజిల్ పై పెంచిన సుంకం కేంద్రం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ... రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ను అభాసుపాలు చేయాలని చూస్తోందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందిస్తున్నదని, ప్రతిపక్షాలు సైతం మెచ్చుకునే ప్రజాపాలన సాగుతోందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కాకుండా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటి రంగాన్ని మరింత అభివద్ధి చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఏ పార్టీకి లేనివిధంగా అత్యధికంగా 60లక్షల సభ్యత్వం కలిగి, దేశంలో అతి శక్తువంతమైన పార్టీగా ఎదిగామన్నారు., బీజేపీ నాయకులు, ఎక్కడైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.
ధాన్యం కొనుగోలులో ముందస్తుగా కోట్లు వెచ్చించి, 6567 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రా న్ని అందజేశారు. జెడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, జెడ్పీ స్టాన్డింగ్ కమిటీ చైర్మెన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య, బొమ్మిశెట్టి సరితాబాలరాజు, కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, నియోజకవర్గ నాయకులు పొట్లపల్లి శ్రీధర్ రావు, ఎంపీపీ, జడ్పీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
వడ్లను కేంద్రం కొనాల్సిందే : ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
నవతెలంగాణ-జనగామ
నిబంధనల మేరకు రైతులు పండించిన పంటను కేంద్రం కొనాల్సిందేనని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జనగామ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడారు. రైతుల ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కొర్రీలుపెడుతోందన్నారు. ఎఫ్‌సీఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కాదన్నారు. ఇవేమీ తెలియని బండి సంజరు అనవసరపు కూతలు కూస్తున్నారన్నారు. కేంద్రం తన వాటా ప్రకారం రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకోకుంటే రాబోయే కాలంలో రైతులే బుద్ధి చెబుతారన్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైరపర్సన్ విజయసిద్ధులు మున్సిపల్ చైర్పర్సన్, జమున లింగయ్య, పాల్గొన్నారు.