Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
మండల పరిధి ఓబులాపూర్ గ్రామంలో సర్పంచ్ గార్లపాటి నీరజారెడ్డి అధ్యక్షతన, మండల కేంద్రంలో సర్పంచ్ బాల్లెపు వెంకటనరసింహారావు అధ్యక్షతన శుక్రవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మెన్ తీగల కర్ణాకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, కాళేశ్వరం ప్రాజెకుతో తెలంగాణాలో పుష్కలంగా నీరందుతుందన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా అందించడంతోపాటు కోతలు లేని విద్యుత్ అందిస్తున్నదన్నారు. మార్కెట్ డైరెక్టర్ తాటికాయల వరుణ్, ఎంపీటీసీ జ్యోతి రజిత యాకయ్య, మండల కో కోప్షన్ ఎండీ నజీర్, సీఈవో అంగిడి భాస్కర్ పాల్గొన్నారు.