Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిల్పూర్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని ఎంపీపీ బొమ్మశెట్టి సరితబాల్రాజ్ అన్నారు. శుక్రవారం మండలం లోని శ్రీపతి పల్లి, లింగంపల్లి ,చిల్పూర్ తదితర గ్రామాల్లో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సర్పంచులు కేసీరెడ్డి ప్రత్యూషరెడ్డి, రాజ్‌కుమార్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ రంగు హరీష్, రైతు సంఘం అధ్యక్షుడు పిట్టల సంపత్, ఏవో రమ్య, పంచాయతీ సెక్రెటరీ శ్రీకాంత్ కొనుగోలు కేంద్రాల సభ్యులు పిట్టల రజిత, వైష్ణవి, వెంకటమ్మ పాల్గొన్నారు.