Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశేఖర్
నవతెలంగాణ-సుబేదారి
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండలోని టీఎస్ యూటీఎప్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలన్నారు. పెండింగులో ఉన్న నాలుగు విడతల డీఏలను విడుదల చేయాలన్నారు. కేజీబీవీ ఉపాద్యాయులు, ఉద్యోగులను ప్రస్తుత వేతనంపై 30శాతం ఫిట్మెంట్ వేసినా సవరణ అమలుకు ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలన్నారు. సమ్మెటీవ్ అసైన్మెంట్ పరీక్షల షెడ్యూలును వాయిదా వేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు సీహెచ్ రవీందర్ రాజు, పెండెం రాజు, ప్రధాన కార్యదర్శి బద్దం వెంకటరెడ్డి, సీహెచ్ రఘుపతి రెడ్డి, సదాశివ రెడ్డి, మెదరి దామోదర్, సుజన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.