Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
మండల కేంద్రంలోని సనాతన శివాలయంలో కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే లక్ష దీపోత్సవ కార్యక్రమ కరపత్రాన్ని ఆలయ చైర్మెన్ ఏపూర్ రవీందర్‌రెడ్డి, అధ్యక్షుడు పింగళి శ్రీనివాస్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్ మాట్లాడారు. సనాతన ధర్మంలో కార్తీక మాసానికి విశిష్టత ఉందన్నారు. ఈనెల 19న శివాలయంలో సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఉత్సవాలు నిర్వహించలేకపోయిన క్రమంలో ఈసారి అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి పెసరి శివ, బీరం సురేందర్‌రెడ్డి, గంప యుగంధర్, దారం శ్రీనివాస్, నల్లతీగల మహిపాల్, దేసు నరేష్, బీరం శ్రీపాల్రెడి,్డ పానుగంటి శ్రీనివాస్, తండ శ్రీహరి, ఆలయ పూజారి సతీష్ పాండే తదితరులు పాల్గొన్నారు.