Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
విద్యార్థులు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్ఫూర్తితో ముందుకు సాగాలని ఏఎస్సై శోభారాణి కోరారు. జిల్లా కేంద్రంలోని బాలాజీ విద్యా సంస్థలో జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని శనివారం బాలల దినోత్సవం నిర్వహించారు. 9వ తరగతి విద్యార్థిని ఉపాధ్యాయులను అనుకరిస్తూ అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ములుగు ఏఎస్ఐ శోభారాణి హాజరై మాట్లాడారు. నెహ్రూ అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన బాలాజీ ప్రిన్సిపాల్ రజనీకాంత్ మాట్లాడుతూ విద్యావేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, గాంధీజీ సన్నిహితుడిగా, శాంతికి చిహ్నంగా, దేశానికి తొలి ప్రధానమంత్రిగా విశిష్ట సేవలు అందించారని తెలిపారు. అనంతరం పిల్లలందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సెక్రెటరీ రాజేశ్వర్రెడ్డి, ఏఓ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.