Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ఈనెల 16న హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ అధ్యక్షతన శనివారం మిలియన్ మార్చ్ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాస్కర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం యువతను విస్మరించిందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక మంది యువత ప్రాణాత్యాగాలు చేశారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్లలో ఉద్యోగాల భర్తీని విస్మరించిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నిటినీ వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, అధికార ప్రతినిధి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జినుకల కష్ణాకర్రావు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సానికొమ్ము హరీష్‌రెడ్డి, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి చల్ల మోహన్‌రెడ్డి, కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షుడు గొంగళ్ల కట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.