Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మెన్ పదవిని, మహాజాతర నామినేటెడ్ పనులను స్థానికులకే ఇవ్వాలని సమ్మక్క పూజారి సిద్ధబోయిన సురేందర్, టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ఎనగందుల బాబురెడ్డి, మేడారం గ్రామ కమిటీ అధ్యక్షుడు గజ్జెల సమ్మయ్య, మాజీ అధ్యక్షుడు దండుగుల మల్లన్న కోరారు. మేడారం స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి జగదీష్‌ను శనివారం జెడ్పీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సురేందర్, బాబురెడ్డి, సమ్మయ్య, మల్లన్న మాట్లాడారు. మేడారం మహాజాతరకు కోటి పైచిలుకు జనం వచ్చి వనదేవతల గద్దెలను సందర్శించుకుంటారని తెలిపారు. జనం పడేసిన విస్తరాకులు, మేకల, కోళ్ల కళేబరాలు, ప్లాస్టిక్ సంచులు తదితర అంశాల వల్ల జాతర ప్రాంగణం మొత్తం మేడారం పరిసర ప్రాంతాలు మొత్తం కలుషితమై ఈగలు దోమల బాధలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. జాతరలో విసర్జక పదార్థాల మూలంగా స్థానికులు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ క్రమంలో స్థానికులకే నామినేటెడ్ పనులు ఇవ్వాలని కోరారు. కలెక్టర్, ఇతర శాఖల అధికారులు కూడా జాతరలో నిర్వహించే పనులను స్థానికులకే ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో లింగాల మాజీ సర్పంచ్ కోరం చంద్రయ్య, సమ్మక్క పూజారి సిద్దబోయిన వసంతరావు, టీఆర్ఎస్ నాయకులు గండికోట నారాయణ, తాటి రాంచందర్, పోలెబోయిన లక్ష్మీనారాయణ, పులుసం సురేందర్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.