Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
ప్రభుత్వం కల్పించిన అవకాశాలను వినియోగించుకొని విద్యార్థులు విద్యతోపాటు ఇతర అన్ని రంగాల్లో నైపుణ్యం ప్రదర్శించి రాణఙంచాలని బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జయశ్రీ కోరారు. డివిజన్ కేంద్రంలోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మాజీ ప్రధాని నెహ్రూ జయంతిని పురస్కరించుకొని శనివారం బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్వయం పరిపాలన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు ఉపాధ్యాయులను మరిపించేలా పాఠాలు బోధించారు. ప్రిన్సిపాల్, డీఈఓ, రాష్ట్ర గురుకులాల సెక్రెటరీ, ఉపాధ్యాయుల పాత్రల్లో విద్యార్థులు ఒదిగిపోయారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ బహుమతులు అందించి అభినందించారు. అనంతరం ప్రిన్సిపాల్ జయశ్రీ మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని కోరారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే జీవితంలో ఏదైనా సాధించొచ్చని చెప్పారు. విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యతోపాటు భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మమత, ఆసియా తన్వీన్, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.