Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల అధికారి, సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ
నవతెలంగాణ-తొర్రూరు
డివిజన్ కేంద్రంలోని మత్స్య సహకార సొసైటీ కార్యాలయంలో తొర్రూరు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. మత్స్య శాఖ సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ, ఇన్స్పెక్టర్ నరేష్ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. అధ్యక్షుడుగా శంకరబోయిన యాకయ్య, ఉపాధ్యక్షుడుగా గంధం చంద్రమూర్తి, కార్యదర్శిగా అలువాల రాము, కోశాధికారి గా రెడ్డబోయిన రవి, డైరెక్టర్లుగా గూబ యాకయ్య, బాద ఉప్పలయ్య, భాష బోయిన యాకయ్య, రెడ్డబోయిన మహేష్, శంకరబోయిన ఉపేందర్లను ఎన్ను కున్నారు. నూతన పాలక వర్గాన్ని ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి అలువాల సోమయ్య, మండల అధ్యక్షులు కొత్తూరు రమేష్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అలువాల సోమయ్య, కొత్తూరు రమేష్ మాట్లా డారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, ఇందులో భాగంగా ఏటా నూరు శాతం సబ్సిడీతో చేప పిల్లలను జలాశయాల్లో వదులుతోందని తెలిపారు. కార్యక్రమంలో ప్రతినిధులు అలువాల మురళీ, వెలుగు సోమయ్య, గంధం సోమయ్య, రాజు, ఇండ్ల వెంకన్న, కొండరాజు, అంజి తదితరులు పాల్గొన్నారు.