Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్లాక్ రైస్ పండిస్తున్న వైనం
నవతెలంగాణ-చిన్నగూడూరు
ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై మక్కువ పెరిగింది. సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలకు గిరాకీ పెరగడంతో మండలంలోని పగిడిపల్లి గ్రామం బాబోజీతండాకు చెందిన బీ ఫార్మసీ పూర్తి చేసిన గుగులోతు మురళీ తనకున్న ఆరెకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ రెండెకరాల్లో బ్లాక్ రైస్ పండిస్తున్నాడు. బ్లాక్ రైస్‌తో ఆరోగ్య ప్రయోజనాలు గూగుల్‌లో సెర్చ్ చేసి పంట పండిస్తున్నాడు. బ్లాక్ రైస్‌లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతోపాటు అది యాంటీ క్యాన్సర్ ఏజెంట్‌గా పని చేస్తుంది. హద్రోగ వ్యాధులను తగ్గిస్తుంది. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా బరువును, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే విటమిన్ బీ, ఈ, నియాసిన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజా విలువలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాలకు తన బంధువులకు, స్నేహితులకు తెలిపి బ్లాక్ రైస్ సాగుపై అవగాహన కల్పిస్తున్నాడు. వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు పండించాలని వ్యవసాయ అధికారులు, ప్రభుత్వం ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ రైస్ దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ కేజీ బియ్యం సుమారు రూ.200లు పలుకుతుందని తెలిపాడు.