Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యాన్ని కొనాలని సీపీఐ రాష్ట్ర నాయకులు కట్టెబోయిన శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ సెంటర్లో శనివారం రాస్తారోకో నిర్వహిం చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం ఆగదన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు లబ్ది చేకూర్చే కుట్ర చేస్తోందన్నారు. వరి సాగుపై ఆంక్షలు విధించొద్దని, యాసంగిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు జంపాల వెంకన్న, పల్లా కోటి, కష్ణమూర్తి, రమేష్, భిక్షమయ్య, భీమ్లా, వెంకన్న, మల్లయ్య, సక్రు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.