Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వర్ధంతి
నవతెలంగాణ-గార్ల
పేదల అభ్యున్నతే లక్ష్యంగా వేజెళ్ల సైదులు రావు కృషి చేశారని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మండ రాజన్న, కందునూరి శ్రీనివాస్ తెలిపారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని సత్యనారాయణపురం క్రాస్ రోడ్ వద్ద శని వారం సైదులు 19వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. వేజెళ్ల విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. అనంతరం వర్ధంతి సభకు గిరిప్రసాద్ అధ్యక్షత వహించగా రాజన్న, శ్రీనివాస్ మాట్లాడారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన సైదులు చిన్నప్పటి నుంచే ఎర్రజెండా పట్ల ఆసక్తితో ఉద్యమాల దిశగా అడుగులు వేశారని చెప్పారు. భూస్వాములు, పెత్తందార్ల దోపిడీని వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు. దోపిడీ పీడన లేని సమాజ నిర్మాణం కోసం ఇల్లందు డివిజన్లో కీలకమైన పాత్ర పోషిస్తూ పార్టీ విస్తరణకు పాటుపడ్డా రని చెప్పారు. ఎర్రజెండా ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపై పోరాడుతునే క్రీడా కారుడిగా ప్రజాహృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడని తెలిపారు. తొలుత భారీ ప్రదర్శన నిర్వహించారు. సభలో నాయకులు గడ్డిపాటి రాజారావు, నాదెండ్ల కోటేశ్వరరావు, సత్యం, లక్ష్మణ్, శ్రీను, సర్వర్, మల్లయ్య, బయ్యారం మండల కార్య దర్శి నంబూరి మధు, నాయకులు యాదగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.