Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా న్యాయమూర్తి రామచంద్రరావు
నవతెలంగాణ-ములుగు
ఈ-శ్రమ్ కార్డు ద్వారా కార్మికులకు లబ్ది చేకూరుతుందని జిల్లా కోర్టు న్యాయమూర్తి నాదెండ్ల రామచంద్రరావు తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులు సామాజిక భద్రతతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందవచ్చని ఆయన తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో పాన్ ఇండియా అవేర్నెస్, ఔట్రీచ్ క్యాంపెయిన్ మెగా క్యాంప్ ప్రోగ్రాంలో భాగంగా కార్మికులకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ షర్ఫుద్దీన్తో కలిసి న్యాయమూర్తి రామచంద్రరావు శనివారం ఈ-శ్రమ్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం రామచంద్రరావు మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకుంటే సామాజిక భద్రత లభించడంతోపాటు వివిధ సంక్షేమ పథకాలు అమలౌతాయని చెప్పారు. కార్డుదారులదరికీ 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తారని తెలిపారు. ఈ కార్డు ఉంటేనే ప్రభుత్వాలు అందించే అన్ని రకాల సామాజిక భద్రతా పథకాలు వర్తిస్తాయని వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాలచారి, న్యాయవాదులు సారంగపాణి, రంగోజుల భిక్షపతి, మేకల మహేందర్, రాజేందర్, కానిస్టేబుళుమంద రఘు, బొట్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.