Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకుమట్ల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల బతుకులతో చెలగాలమాడుతున్నాయని టీజేఎస్ మండల అధ్యక్షుడు అంబాల రమేష్ విమర్శించారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అకాల వర్షాలకు కల్లాల్లోని ధాన్యం తడిచి దెబ్బ తింటోందని తెలిఆపరు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రతో 3 నష్టదాయక చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు బొజ్జపెల్లి రాజేందర్, సాద శ్రీనివాస్, మల్లయ్య, ఓదెలు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.