Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
తమ భూమిని కబ్జా చేసి ఆక్రమణకు పాల్పడుతూ భయాందోళనకు గురిచేస్తున్న కొత్తకొండ అశోక్ తోపాటు పలువురి నుంచి తమను రక్షించాలని మండలంలోని నాచారం గ్రామానికి చెందిన బాధిత రైతులు బాసవెన మొండయ్య, కుక్కల దుర్గయ్య, మేకల స్వామి, పెంట కుమార్, కాట్రేవుల ఐలయ్య కోరారు. ఆదివారం పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధును కలిసి సమస్యను విన్నవించారు. అనంతరం వారు మాట్లా డుతూ... స్పందించిన జెడ్పీ చైర్మన్ బాధిత రైతులుఅధైర్య పడవద్దని భరోసా ఇచ్చారని, కొయ్యుర్ పోలీసులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని అదేశించినట్లు రైతులు తెలిపారు. 1980లో నాచారం గ్రామ రెవెన్యూ శివారులో 42 సర్వే నెంబర్లో లవాని పట్టా ప్రభుత్వ భూమి ఒక్కో కుటుంబానికి రెండెకరాల చొప్పున ఐదు కుటుంబాలకు మొత్తం 10 ఎకరాల భూమి మోకాపై చూపిస్తూ అంతిమ పట్టా పత్రాలు జారీ చేశారని తెలిపారు. నాటి నుంచి ఆరుతడి పంటలు పండిస్తూ బతుకుతున్నామ న్నారు. ఈ క్రమంలో పరకాల నుంచి వచ్చిన ఆర్ఎంపీ వైద్యుడు అశోక్ గ్రామంలో కొందరితో కలిసి తమ భూమిని ట్రాక్టర్లతో చదును చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. ఇటీవల భూపాలపల్లి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ,మండల రెవెన్యూ , కొయ్యుర్ పోలిస్లకు ఫిర్యాదు చేశామని వివరించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.