Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు
గాడి పళ్లి ప్రమీల , కందు నూరి కవిత
నవతెలంగాణ-తొర్రూరు
ఐద్వా తొర్రూరు మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కందునూరి కవిత గాడిపెళ్లి ప్రమీల తెలిపారు. ఆదివారం మున్సిపల్ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు అరికట్టాలన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను, దౌర్జన్యాలను అరికట్టాలన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుజేయాన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకొచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయన్నారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. నూతన మండల అధ్యక్ష కార్యదర్శులుగా బోర మన్నెమ్మ, బొల్లం మమతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి యాకోబ్, సహాయ కార్యదర్శి మంచం సోమలక్ష్మి, మార్క సోమలక్ష్మి, బండి కావ్య, ఉపాధ్యక్షులు ఎండి అబ్దుల్ బి , కవిత, యాక లక్ష్మి, యాకూబ్ బి , మల్లేశ్వరి పాల్గొన్నారు.