Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వైస్ ఎంపీపీ అశోక్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం దొంగ ధర్నాలు చేస్తూ రైతులను మరోసారి మోసం చేస్తోందన్నారు. రైతులు పండించిన ధాన్యం కళ్లాల వద్ద భారీ నీలువలు ఉన్నప్పటికీ కొనుగోలు చేయకపోవడం విడ్డూరమన్నారు. ప్రజలను రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్‌రెడ్డి, దుర్గయ్య, బోనాల రాజమౌళి, సాధన రెడ్డి జోడు ప్రదీప్, పోషాల మహేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.