Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని నెహ్రు జయంతని ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు కంబాల ముసలయ్య పాల్గొని మాట్లాడారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించి దేశానికి వెలుగులు నింపిన హహణీయుడు నెహ్రూ అని కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేయాలన్నారు. ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు రాము నాయక్, టౌన్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారామయ్య, ఎంపీటీసీ భూక్య లక్ష్మీ, గ్రామ శాఖ అధ్యక్షులు కోడిశ్రీను పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నెహ్రూ జయంతిని నిర్వహించారు. మండల పార్టీ ప్రచార కార్యదర్శి, ఎంపీటీసీ బానోత్ మోహన్ జీ మాట్లాడారు. సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ జూలకంటి. సీతారాం రెడ్డి, రామదాస్, మండల యూత్ అధ్యక్షుడు చాట్ల సంపత్, గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు పాల్గొన్నారు.