Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి రామచంద్రయ్య
నవతెలంగాణ-బయ్యారం
వరిసాగు పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతూ ఇరు పార్టీలు రైతులతో చెలగాటమాడుతున్నాయని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి రామచంద్రయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సంఘం మండల కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వరి పంట సాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం సరికాదన్నారు. హడావుడిగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. రైతుల వరిదాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలన్నారు. వరి సాగు పె ఆంక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉప్పుడు బియ్యానికి ప్రపంచ మార్కెట్లో భారీగానే డిమాండ్ ఉన్నప్పటికీ ఎగుమతులు చేయడంలో విఫలమవుతుందని ఆరోపించారు. ఎఫ్సిఐ ద్వారా రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత కేంద్రలోని ప్రభుత్వానిదేనని అన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వరి పంట సాగు చేయొద్దని ప్రకటించటం సరికాదన్నారు. 15వ తేదీన కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాల న్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు ప్రకటించడంతోపాటు ప్రోత్సాహకాలు అందించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు సనప పోమ్మయ్య, మండల అధ్యక్షులు రామగిరి బిక్షం, మండల కార్యదర్శి బానోతు నరసింహ, నాయకులు మేకల ఉప్పలయ్య, నూతక్కి భూషణ్ రావు, ధరావత్ మంగీలాల్, పూనెం మంగయ్య, పూనెం లింగన్న, కల్తీ విష్ణు రావు పాల్గొన్నారు.